News

ఆలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి: సీఐ

136views

బాపట్ల జిల్లా చినగంజాం మండల పరిధిలోని దేవాలయాల కమిటీలు.. ఆలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఇంకొల్లు సీఐ రమణయ్య సూచించారు. పోలీస్ స్టేషన్‌లో ఆలయాల కమిటీ సభ్యులతో సీఐ రమణయ్య సమావేశమయ్యారు. దేవాలయాల్లో చోరీలు జరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగానే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. పది రోజులకు ఒకసారి భక్తులు వేసిన కానుకలు, నగదు లెక్కించి బ్యాంకులో డిపాజిట్ చేయాలని వివరించారు. దేవతామూర్తుల విగ్రహాలపై ఉండే బంగారు, వెండి, పంచలోహ ఆభరణాలను భద్రపరచాలన్నారు. ఆలయ భద్రతపై మరిన్ని అంశాలపై కమిటీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఎస్‌ఐ రమేష్, ఆలయాల కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.