News

ట్రంప్ హ‌త్య‌కు ప్లాన్‌.. దోషిగా తేలిన పాకిస్థానీ వ్య‌క్తి

84views

డోనాల్ట్ ట్రంప్‌ను హ‌త్య చేసేందుకు ప్లాన్ చేసిన కేసులో పాకిస్థానీ వ్య‌క్తిని అమెరికా న్యాయ‌శాఖ దోషిగా తేల్చింది. ఇరాన్ ఆదేశాల ప్ర‌కారం అత‌ను అమెరికా రాజ‌కీయ‌వేత్త‌ల‌ను హ‌త్య చేసేందుకు ప్లాన్ చేసిన‌ట్లు అమెరికా న్యాయ‌శాఖ ఆరోపించింది. నిందిత వ్య‌క్తిని ఆసిఫ్ మెర్చంట్‌గా గుర్తించారు. 2020లో ఇరాన్ మిలిట‌రీ నేత ఖాసిమ్ సొలేమ‌ని హ‌త్య‌కు ట్రంప్ ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో ట్రంప్‌తో పాటు కొంద‌రు అమెరికా నేత‌ల‌ను హ‌త్య చేయాల‌ని ఆసిఫ్ మెర్చంట్ ప్లాన్ చేశారు. దీని కోసం అమెరికాలో కొంద‌ర్ని రిక్రూట్ చేసేందుకు అత‌ను ప్లాన్ చేశాడు. ఆసిఫ్ టార్గెట్‌లో ట్రంప్‌తో పాటు జో బైడెన్, నిఖ్కీ హేలీ కూడా ఉన్నారు.

ఇరాన్ అధికారుల ఆదేశాల ప్ర‌కారం అమెరికా నేత‌ల హ‌త్య కోసం ఆసిఫ్ రిక్రూట్మెంట్‌కు పాల్ప‌డ్డాడ‌ని, దీన్ని ఉగ్ర‌వాద చ‌ర్య‌గా భావిస్తున్నామ‌ని అమెరికా న్యాయ‌శాఖ పేర్కొన్న‌ది. న్యూయార్క్ సిటీ కోర్టు ఈ కేసుపై గ‌త వారం వాద‌న‌లు జ‌రుగుతున్నాయి. అయితే ఇరాన్‌లోని ఇస్లామిక్ రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ కార్ప్స్‌తో క‌లిసి హ‌త్య‌ల‌కు ప్లాన్ చేసిన‌ట్లు ఆసిఫ్ మ‌ర్చెంట్ అంగీక‌రించాడు. అయితే టెహ్రాన్‌లో ఉన్న త‌న ఫ్యామిలీని కాపాడుకోవాల‌న్న భ‌యంతో ఆ ప‌నిచేసిన‌ట్లు చెప్పాడు.