News

లంకమలలో వెలుగులోకి త్రిపాదాలు

105views

ఏ క్షేత్రంలోనైనా స్వామి వారి రెండు పాదాలే దర్శనమిస్తాయి. కానీ.. వైయస్సార్ కడప జిల్లా బద్వేలు మండల పరిధి లంకమల్లేశ్వర శైవక్షేత్రంలో ఓ రాతిపై త్రిపాదాలు వెలుగు చూశాయి. వీటితో పాటు పురాతన శంఖులిపి, బ్రహ్మిలిపి, దేవనాగరి రాతి శాసనాలను ఇటీవల సిద్దవటం ఎఫ్‌ఆర్వో కళావతి గుర్తించి ఇటీవల పురావస్తు శాఖకు సమాచారం అందించారు. వారు పరిశోధనలు చేసి ఇక్కడ మరుగున పడిన పురాతన చారిత్రక ప్రాంతంగా తేల్చారని.. రవాణా సౌకర్యం లేని రోజుల్లో భక్తులు అటవీ ప్రాంతంలో వెలసిన ఆలయాలకు కాలినడకన వచ్చి సందర్శించేవారని వారు వెల్లడించారని ఆమె చెప్పారు.