
138views
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు టిటిడి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సివిల్, విద్యుత్తు విభాగం పర్యవేక్షణలో వసతుల కల్పనకు పనులకు శ్రీకారం చుట్టారు. అయితే.. రామయ్య క్షేత్రంలో తూర్పు, ఉత్తర, దక్షిణ గోపురాలు కళ తప్పాయి. రంగ మండపం, శ్రీవారి పోటు, యాగశాల పైకప్పు దెబ్బతిన్నాయి. మరమ్మతు పనులు చేయడానికి తితిదే నుంచి కేంద్ర పురావస్తు శాఖకు అవసరమైన నిధులను ముందస్తుగా ఇచ్చారు.





