News

గగన్‌యాన్‌ డ్రోగ్‌ పారాచూట్‌ పరీక్ష విజయవంతం

104views

ప్రతిష్టాత్మక మానవసహిత గగన్‌యాన్‌ ప్రాజెక్టులో ఉపయోగించే కీలక డ్రోగ్‌ పారాచూట్‌ను రక్షణపరిశోధనాభివృద్ధి సంస్థ గురువారం విజయవంతంగా పరీక్షించింది. వ్యోమగాములున్న ‘క్రూ మాడ్యూల్‌’వేగంగా ఆకాశం నుంచి భూమి దిశగా స్వేచ్ఛగా పడేటప్పుడు దాని వేగాన్ని నియంత్రించేందుకు ఈ డ్రోగ్‌ పారాచూట్‌ను ఉపయోగించనున్నారు. మాడ్యూల్‌ బరువుకు చిరిగిపోకుండా సమర్థవంతంగా దాని వేగాన్ని నియంత్రించేలా దీనిని డిజైన్‌చేశారు.

చండీగఢ్‌లోని డీఆర్‌డీఓకు చెందిన టరి్మనల్‌ బాలిస్టిక్స్‌ రీసెర్చ్‌ లే»ొరేటరీ(టీబీఆర్‌ఎల్‌)లోని రైల్‌ ట్రాక్‌ రాకెట్‌ స్లెడ్‌(ఆర్‌టీఆర్‌ఎస్‌) కేంద్రంలో ఈ పారాచూట్‌ను పరీక్షించామని రక్షణ శాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇద్దరు సైకిల్‌పై ప్రయాణిస్తూ వెనక కూర్చున్న వ్యక్తి సైకిల్‌ వెళ్తున్న దిశకు వ్యతిరేక దిశలో ఒక భారీ గొడుగును తెరిస్తే అది సైకిల్‌ వేగాన్ని కాస్తయినా తగ్గిస్తుంది. అ

దే మాదిరిగా వ్యోమగాములు భూమి దిగువ కక్ష్యలోకి వెళ్లి తిరిగి మాడ్యూల్‌లో కూర్చుని వచ్చేటప్పుడు అది అతివేగంగా కిందకు రాకుండా ఒక పరిమిత వేగంతో దూసుకొచ్చేలా ఈ డ్రోగ్‌ పారాచూట్‌ దోహదపడనుంది. వేగంగా ఒక నియంత్రిత స్థాయిలోకి వచ్చేలా తర్వాత మరో రకం మూడు, నాలుగు చిన్న పారాచూట్‌లు తెరచుకుని మాడ్యూల్‌ వేగాన్ని మరింత తగ్గిస్తాయి. దీంతో మాడ్యూల్‌లోని వ్యోమగాముల ప్రాణాలకు ఎలాంటి హానీ ఉండదు.

ఇందులోభాగంగా సైకిల్‌కు బదులు రైలు పట్టాల మీద డ్రోగ్‌ పారాచూట్‌ను హఠాత్తుగా తెరచి దాని సామర్థ్యాన్ని విశ్లేషించారు. ‘అర్హతస్థాయి లోడింగ్‌ టెస్ట్‌’లో పారాచూట్‌ విజయం సాధించిందని రక్షణశాఖ వెల్లడించింది. విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్, ఇస్రో, ఏరియల్‌ డెలివరీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్ మెంట్, డీఆర్‌డీఓలు సంయుక్తంగా ఈ పరీక్షను చేపట్టాయి.

అత్యధిక వేగంగా వెళ్లే ఏరోడైనమిక్, బాలిస్టిక్‌ వస్తువుల పనితీరును రైల్‌ ట్రాక్‌ రాకెట్‌ స్లెడ్‌(ఆర్‌టీఆర్‌ఎస్‌) కేంద్రంలో పరీక్షిస్తుంటారు. ఆర్‌టీఆర్‌ఎస్‌ మీద వాస్తవ మాడ్యూల్‌ కంటే అత్యధిక బరువైన వస్తువుకు పారాచూట్‌ను జతచేసి పారాచూట్‌ను పరీక్షించారు.

అనూహ్య పరిస్థితుల్లో షెడ్యూల్‌చేసిన మాడ్యూల్‌ కంటే అధిక బరువైన మాడ్యూల్‌ను సైతం మోయగలిగేలా పారాచూట్‌ను సిద్ధంచేస్తున్నారు. ‘‘గగన్‌యాన్‌ మిషన్‌ను షెడ్యూల్‌ ప్రకారం ముందుకు తీసుకెళ్లేలా చండీగఢ్‌ పరీక్ష కేంద్రంలోని శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సిబ్బంది అహరి్నశలు శ్రమిస్తున్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా ఇదొక కీలక ముందడుగు’’అని రక్షణశాఖ ప్రశంసించింది. పరీక్ష బృందాన్ని డీఆర్‌డీఓ చైర్మన్‌ సమీర్‌ వి కామత్‌ సైతం అభినందించారు.