News

బాన్సువాడలో హిందూ సిబ్బందిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన వి హెచ్ పి

238views

బాన్సువాడలో హిందూ సిబ్బందిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్.

గత శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని రిలయన్స్ మార్ట్లో తమ విధుల్లో భాగంగా భక్తి గీతాలు వింటున్న హిందూ మహిళా ఉద్యోగినిపై మరియు ఇతర సిబ్బందిపై జరిగిన దాడిని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది. ఒక వ్యక్తి తన పని ప్రదేశంలో భక్తి గీతాలు వినడం రాజ్యాంగం కల్పించిన హక్కు, దానిని ప్రశ్నిస్తూ, వీడియోలు తీస్తూ మహిళా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం అమానుషం. ప్రశాంతంగా ఉన్న బాన్సువాడలో ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించి, హిందువులపై భౌతిక దాడులకు పాల్పడిన ఇస్లామిక్ మతోన్మాదులను ప్రతి ఒక్కరిని గుర్తించి, వారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి.

హిందూ వ్యాపార సంస్థలకు, ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మరియు పోలీసు యంత్రాంగంపై ఉంది.ఈ ఘటనలో బాధితులైన వారిపై కాకుండా, దాడులకు ప్రేరేపించిన అసలైన ఇస్లామిక్ మతోన్మాద సూత్రధారులపై చట్టం తన విధిని నిర్వర్తించాలి.హిందూ యువతపై తప్పుడు కేసులు నమోదు చేయాలనే కుట్రలను వెంటనే నిలుపుదల చేయాలి.

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ, పక్కా ప్రణాళికతో దాడులు చేసే సంస్కృతిని సహించేది లేదని వి హెచ్ పి  స్పష్టం చేస్తోంది. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి, 24 గంటల్లోగా అసలైన నిందితులందరినీ అరెస్ట్ చేయాలి. లేనిపక్షంలో విశ్వహిందూ పరిషత్ మరియు ఇతర హిందూ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నాము.

ప్రజలందరూ శాంతియుతంగా ఉంటూనే, ధర్మాన్ని రక్షించుకోవడానికి ఐక్యంగా ఉండాలని కోరుతున్నాము.

డా. రావినూతల శశిధర్,
జాతీయ అధికార ప్రతినిధి
9390766688

బాన్సువాడ సంఘటనపై రాష్ట్ర DGP స్వయంగా విచారణ జరపాలి.

రాష్ట్ర హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించాలి. తెలంగాణాలో ఇస్లామిక్ మతోన్మాద భావజాలం ఎంత ప్రమాదస్థాయికి చేరిందో బాన్సువాడ సంఘటన తెలియజేస్తుంది. న్యాయం అడిగిన హిందువులపై హత్యాయత్నం లాంటి తీవ్రమైన కేసులు ఎలా నమోదు చేస్తారు?. బాన్సువాడలో చట్టవిరుద్ధంగా నడుస్తున్న మదర్సాల కార్యకలాపాలపై విచారణ జరపాలి.

బాన్సువాడ లో అక్రమంగా బంగ్లాదేశీ & రోహింగియాముస్లీం చొరబాటుదారులు ఉంటున్నారనే ఆరోపణలపై విచారణ జరిపించాలి. బాన్సువాడలో రోజురోజుకూ రెచ్చిపోతున్న ఇస్లామిక్ మతోన్మాద భావజాలం పై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి.

న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చిన హిందువులపై అక్రమ కేసులు ఉపసంహరించుకోక పోతే VHP రాష్ట్ర వ్యాప్త ఆందోళనను నిర్వహిస్తుంది.