
124views
ఛత్తీస్‌గఢ్‌లోని మాడేరియా డివిజన్ కమిటీకి చెందిన ఇద్దరు మావోయిస్టులు ఆంధ్ర పోలీసుల ఎదుట లొంగిపోయారు. బుధవారం అల్లూరి జిల్లా ఎస్పీ అమితి బర్దార్ ఎదుట వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారు. అనంతరం జిల్లా ఎస్పీ బర్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ, పునరావాస పథకాలను పూర్తిగా వినియోగించుకుని గౌరవప్రదమైన, శాంతియుత జీవితం గడపాలని లొంగిపోయిన మావోయిస్టులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ ప్రాయోజిత శిక్షణ కార్యక్రమాల ద్వారా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని వారికి సూచించారు. అలాగే ఇతర మావోయిస్టులు సైతం సమీప పోలీస్ స్టేషన్‌లో స్వచ్ఛందంగా లొంగిపోవాలన్నారు. అలా కాకుంటే కుటుంబ సభ్యుల ద్వారా.. నేరుగా సీనియర్ పోలీస్ అధికారులను సంప్రదించాలని మావోయిస్టులకు జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.





