News

భారతీయులు హిందూ కుటుంబంలో భాగం : సహ సర్ కార్యవాహ

174views

భారత్ ప్రత్యేకంగా వివిధ కులాలు, వర్గాలు, మతాలు, నమ్మకాల ప్రజలు శాంతియుతంగా కలిసి జీవించడానికి అనుమతిస్తుంది. ఇక్కడి నివాసితులందరూ భారతీయులు హిందూ కుటుంబంలో భాగం” అని అన్నారు ఆర్ ఎస్ ఎస్ సహ సర్ కార్యవాహ డాక్టర్ కృష్ణగోపాల్.

వెస్ట్ ఇంఫాల్ లోని తంగల్ బజార్‌లోని ధర్మశాలలో జరిగిన హిందూ సమ్మేళనంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవాహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బజార్ ఉపనగర్ హిందూ సమ్మేళన్ సమితి నిర్వహించిన ఈ కార్యక్రమం సంఘ కార్య శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులను ఐక్యంగా ఉంచి సామాజిక సవాళ్లను పరిష్కరించాలని కోరారు. హిందువులనుఏకం చేయడం ఎలా అనే సమస్య వచ్చినప్పుడు 1925లో నాగ్ పూర్ లో హెడ్గేవార్ జీ కేవలం ఒక శాఖతో సంఘను స్థాపించారనీ, ఇప్పుడు మనం దేశమంతటా 90వేల కు పైగా శాఖలను ఏర్పాటు చేశామని వారన్నారు. “హిందువులు పక్షులకు ఆహారం పెడతారు, నదులు, సరస్సులు, కొండలు , ప్రకృతిని పూజిస్తారు; ఎవరూ ఆకలితో నిద్రపోకుండా చూసుకుంటారు , అవసరమైన వారికి సహాయం చేస్తారు” హిందువులకు ఉండే కరుణ, ప్రేమ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారత్ ను విలక్షణమైన దేశంగా నెలబెట్టాయని అన్నారు. ఇటువంటి సమ్మేళనాలు ఈ హిందూత్వాన్ని మేల్కొల్పడం శాంతి, ప్రేమ, స్నేహంతో కూడిన సమాజాన్ని నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి అని వారన్నారు.

“ధర్మం అంటే నిజాయితీగా విధులను నిర్వర్తిస్తూ ఇతరులకు హాని చేయకపోవడం – ఉపాధ్యాయులు హృదయపూర్వకంగా విద్యను అందించడం లేదా తల్లిదండ్రులు పిల్లలను సరిగ్గా పెంచడం వంటివి. వేల సంవత్సరాలుగా మనుగడ సాగించిన ఏకైక పురాతన నాగరికత భారత్ అని, కానీ కొన్ని అదుపుతప్పాయని ఈ సందర్భంగా అని డాక్టర్ కృష్ణగోపాల్ పేర్కొన్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో హిందూ సమాజం విచ్ఛిన్నమవుతోంది. “ఇది క్షీణిస్తున్న పరివారీ సంస్కారం నుండి వచ్చింది. కుటుంబాలు ఎక్కువగా మాట్లాడుకోవాలి, వారపు భోజనం పంచుకోవాలి, ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోవాలి” అని ఆయన సలహా ఇచ్చారు.భారత్‌ను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల దుర్వినియోగంపై ఆయన చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు.