
ఫిబ్రవరి మొదటి వారంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి శ్రీ దత్తాత్రేయ హోసబలే దక్షిణ అస్సాం ప్రాంతంలో పర్యటించారు. ఈ సమయంలో సంఘ్ కార్య శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 6న రామకృష్ణ నగర్ లో జరిగిన ప్రముఖ పౌరుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, భారతదేశం ఒకప్పుడు ‘బంగారు పక్షి’గా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని అన్నారు. అనేక దండయాత్రలు. పోరాటాలు మనదేశంపై జరిగినప్పటికీ మనదేశం సురక్షితంగా ధైర్యంగా నిలిచి ఉందని అన్నారు, రాముడు, శ్రీ కృష్ణుడుతో పాటుగా ఎందరో రుషులు, సాధువులు అవతరించిన మనదేశం ఒక పవిత్ర భూమి అని పేర్కొన్నారు. భారతదేశ గొప్ప సంస్కృతి, సాహిత్యం, సంగీతం, కళలను ‘భారతీయ జ్ఞాన పరంపరగా పేర్కొంటూ నేడు కొత్త విద్యా విధానంలో వాటిని చేర్చడం చారిత్రాత్మిక, దూరదృష్టితో కూడిన చర్య అని అన్నారు. ఫిబ్రవరి 7న హైలకండిలోని శ్రీకృష్ణ శారదా కళాశాల క్రీడా మైదానంలో ‘విశాల్ హిందూ సమ్మేళన్, వేద శాంతి యజ్ఞం’ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ హోసబాలే మాట్లాడుతూ, హిందూ సమాజం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించవద్దని సూచించారు. మన సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, నైతికతను స్వీకరించడం ద్వారా పునరుద్ధరించబడిన, విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అదే రోజు సాయంత్రం సిల్చార్ లోని గురుచరణ్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రధాన పౌర సదస్సు జరిగింది. అందులో సభికుల ను ఉద్దేశించి శ్రీ దత్తాత్రేయ హోసబాలే ప్రసంగిస్తూ, దేశ నిర్మాణం లో చైతన్యవంతమైన, సద్గుణవంతులు, బాధ్యతాయుతమైన పౌరుల పాత్ర చాలా ముఖ్యమైనదన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గత వంద సంవత్సరాలుగా సమాజాన్ని ఏకం చేయడం ద్వారా దేశ నిర్మాణం లక్ష్యం కోసం నిరంతరం కృషి చేస్తోంది. అన్నారు. సంఘం అంటే శాఖ అని, శాఖ అంటే సంఘం అని అన్నారు. ప్రతిస్వయంసేవకుడు శాఖాముఖి కావాలని, సంఘాన్ని అర్థం చేసుకోవడానికి క్రమం తప్పకుండా శాఖకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన స్వయం సేవకులకు పిలుపునిచ్చారు.





