News

సేవాలాల్‌ జయంత్యుత్సవాలు ప్రారంభం

101views

అనంతపురం జిల్లా గుత్తి మండలం సేవా నందు సంతు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతోత్సవ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ ను దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుండి ప్రతి సంవత్సరం సేవాఘడ్ కు వస్తువుంటారు. ఈ రోజు సాయంత్రం నుండి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను నిర్వహిస్తోంది, భక్తులకు త్రాగునీటి వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేసింది వాటితోపాటు ప్రత్యేక హెల్ప్ డెస్క్లను, వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. అదేవిధంగా భక్తులకు రవాణా సౌకర్యం నిమిత్తం గుత్తి, గుంతకల్ పట్టణాల నుండి నుండి సేవాఘడ్ కు ప్రత్యేక బస్సు సర్వీసులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

మాతా జగదాంబ ఆలయంలో హోమం..
సేవాగఢ్‌లోని మాతా జగదాంబ ఆలయ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు మారుతీ ప్రసాద్‌ ఆధ్వర్యంలో అమ్మవారికి సుప్రభాతం, పంచామృతాభిషేకం, మహాగణపతి పూజ, అభిషేకం తదితర పూజలు చేశారు.

భారీ బందోబస్తు..
సేవాలాల్‌ జయంత్యుత్సవాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ రామారావు తెలిపారు.