
132views
హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పలు మార్గాల్లో నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు ట్వీట్ ద్వారా ప్రకటించింది. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాచిగూడ-మధురై, మదురై-కాచిగూడ, హైదరాబాద్-కొల్లం, కొల్లం-హైదరాబాద్, హైదరాబాద్-కన్యాకుమారి, కన్యాకుమారి-హైదరాబాద్ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నిర్ణీత కాలపరిమితి వరకు పొడిగించారు.హోలీ పండుగ నేపథ్యంలో ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని, ఇబ్బందుల్లేని ప్రయాణాన్ని ప్రణాళికబద్ధంగా చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు..





