News

14 నుంచి బ్రహ్మంగారి కల్యాణ మహోత్సవాలు

120views

కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల కల్యాణ మహోత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 14 నుంచి 18 వరకు అన్నమయ్య జిల్లా బ్రహ్మంగారిమఠంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించనున్నారు. నూతన మఠాధిపతి వెంకటాద్రిస్వామి ఆధ్వర్యంలో మఠం మేనేజర్‌ ఈశ్వరాచారి ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవ కార్యక్రమంలో 14న ఉదయం 6 గంటలకు నామ సంకీర్తన , ఉపనిషత్‌ పారాయణం, 8 గంటలకు అభిషేకం, 12 గంటలకు వీరమాంబ ఆరాధన, సాయంత్రం 4 గంటలకు హరికథ, రాత్రి 8 గంటలకు కలశోత్సవం, 9 గంటలకు హరికథ, 10 గంటలకు శేషవాహనోత్సవం తదితర పూజలు నిర్వహించనున్నారు. 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం సుప్రభాతం, 12 గంటలకు దీక్షాబంధనాలంకారోత్సవం, 2గంటలకు నామసంకీర్తన , భజనలు, సాయంత్రం 4 గంటలకు హరిప్రియ కర్నూల్‌ వారిచే సంగీత విభావరి, 4 గంటలకు ఉత్సవం, 6 గంటలకు స్థానిక ఆస్థాన పండితుడిచే ఉపన్యాసం, రాత్రి 9 గంటలకు పెద్దపుత్త గ్రామ ఉభయదాతలుచే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణంను నూతన మఠాధిపతి వెంకటాద్రిస్వామి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. 11 గంటలకు నరనంది ఉత్సవం, 12 గంటలనుంచి జాగారణ ఉంటుంది. 16వ తేదీ సోమవారం ఉదయం నామసంకీర్తనలు, 8 గంటలకు అభిషేకం, 10 గంటలకు మోహినీ అలంకారోత్సవం, 12 గంటలకు భజనలు, రాత్రి 7గంటలకు హరికథ, 8 గంటలకు నంది ఉత్సవం చేపట్టనున్నారు. 17వ తేదీ మంగళవారం ఉదయం పారాయణం, అభిషేకం, 10 గంటలకు నిత్యహోమం, గజోత్సవం, మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రసాద వినియోగం, రాత్రి 9 గంటలకు పుష్పరథోత్సవం కనులపండువగా నిర్వహించనున్నారు. 18వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు వసంతోత్సవం, రాత్రి 8 గంటలకు బలిహరణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.