News

దేహ ముక్తులైన ఆర్.ఎస్.ఎస్ సీనియర్ ప్రచారక్ పరమేశ్వరన్ జీ.

1.2kviews

ఆర్.ఎస్.ఎస్ సీనియర్ ప్రచారక్ మరియు పద్మ విభూషణ్ శ్రీ పి. పరమేశ్వరన్ స్వర్గస్తులయ్యారు. చివరి రోజుల్లో కేరళ లోని పాలక్కడ్ గ్రామంలోని తన స్నేహితుడి ఇంట్లో ఉంటూ వచ్చిన స్వర్గీయ పరమేశ్వరన్ అక్కడే శివైక్యం పొందారు.  ఆయన గొప్ప సామాజిక సంస్కర్త మరియు నిజమైన జాతీయవాది. తన జీవితమంతా దేశ సేవకే అంకితం చేశారు.  ఆయన కన్నుమూయడం సమాజానికి తీరని లోటు.

పరమేశ్వర్జీ భారతీయ విచార కేంద్ర వ్యవస్థాపకులు. దాని డైరెక్టర్ గా కూడా పనిచేశారు. అలాగే వివేకానంద కేంద్ర అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేశారు.  సామాజిక, సాంస్కృతిక, మత మరియు జాతీయ సమస్యలపై ఆయన రచనలు & ఆలోచనలు అసమానమైనవి.  అత్యవసర సమయంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ఆయన చేసిన కృషి ఎప్పుడూ గుర్తుండిపోతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.