News

27 దేశాలతో అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి ఏర్పాటు

692views

ప్రపంచవ్యాప్తంగా వ్యక్తుల మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు 27 దేశాలు కలిసి అంతర్జాతీయ మత స్వాతంత్య్ర కూటమి (ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం అలయెన్స్)గా ఏర్పాటయ్యాయి.అమెరికాలోని వాషింగ్టన్‌లో ఫిబ్రవరి 5న ఈ కూటమి ప్రారంభమైంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, బ్రిటన్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, నెదర్లాండ్‌‌స, గ్రీస్ తదితర దేశాలు ఈ కూటమిలో సభ్య దేశాలుగా చేరాయి. మత స్వాతంత్యాన్న్రి గౌరవించి, పరిరక్షించేందుకు కట్టుబడి ఉంటామని కూటమిలోని సభ్య దేశాలు ప్రతినబూనాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.