News

దేశంలోని యువతను ఇస్లామిక్ ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న ఉగ్రవాదికి 10 ఏళ్ల జైలు

148views
భారత్ కి వ్యతిరేకంగా జిహాద్ కోసం ముస్లిం యువకులను సిద్ధం చేస్తున్న లష్కరే తోయబా సయీద్ ఇద్రిస్ విషయంలో ఎన్ఐఏ కోర్టు శిక్ష విధించింది. 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 70 వేల జరిమానా విధించింది.
ఈ మాడ్యుల్ అంతా కూడా పాకిస్తాన్ ఆదేశాలతోనే పనిచేస్తోందని ఎన్ఐఏ దర్యాప్తు బృందం పేర్కొంది. అలాగే సయ్యద్ ఎం. ఇద్రీస్ (33) పాక్ ఆదేశం మేరకు పశ్చిమ బెంగాల్ లో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయబా నియామక మాడ్యుల్ ను నడుపుతున్నట్లు పేర్కొంది. ముస్లిం యువకులను ఇస్లామిక్ ఉగ్రవాదం వైపు ప్రభావితం చేసి, ఉగ్రవాద సంస్థల్లో చేరేలా చేస్తున్నాడని ఎన్ఐఏ పేర్కొంది.
భారత్ లో లష్కరే తోయబా నెట్ వర్క్ ను బలోపేతం చేయడంలో ఇద్రిస్ చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఉత్తరకన్నడ జిల్లాకు చెందిన ఇద్రీస్ పై ఐపీసీ సెక్షన్ల కింద, చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద, మరియు పలు సెక్షన్ల కింద దోషిగా తేల్చింది ఎన్ఐఏ కోర్టు.