News

వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి

193views

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం 8 కోట్ల 74 లక్షల రూపాయల నిధులను కేటాయించామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో ఆయన ఈరోజు వేదగిరిలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ.. మొదటి దశలో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఏడాదిన్నర లోగా పూర్తి చేస్తామన్నారు. వేదగిరి నరసింహస్వామికి సంబంధించి 11 వందల 76 ఎకరాల భూములు ఉన్నాయని… వీటిలో 100 ఎకరాల్లో సంప్రదాయేతర ఇంధన వనరుల కార్పొరేషన్ సహకారంతో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ను ఏర్పాటు చేస్తామన్నారు.