
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది అనేది వేడుకల కోసం కాదని, ఆత్మపరిశీలనకు సమయమని అఖిల భారతీయ సహ సర్ కార్యవాహ్ అరుణ్ కుమార్ అన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను చేరుకోవడం, యావత్ సమాజాన్ని ఏకం చేయడమే ఈ యేడాది లక్ష్యమని ప్రకటించారు. సంఘ కార్య శతాబ్దిని పురస్కరించుకొని పంజాబ్ లో మేధావుల సమ్మేళనం జరిగింది.
ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. సంఘ్ యాత్ర అనేది వ్యక్తి నిర్మాణంతో మొదలై, దేశ నిర్మాణం వరకూ కొనసాగుతుందని ప్రకటించారు. ఒకప్పుడు భారత దేశం, భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే అగ్రస్థానంలో వుండేదని, అయినా.. దేశం వెయ్యి సంవత్సరాల పాటు ఎందుకు పోరాడాల్సి వచ్చిందన్న ప్రశ్న కోసం జవాబును హెడ్గేవార్ శోధించారని, ఈ సమయంలో దీనికి నాలుగు కారణాలను గుర్తించారన్నారు.
మొదటిది వ్యక్తి భావన పెరిగి, దేశ చింతన బలహీనపడిందని, అలాగే విదేశీయుల పాలనలో ఏకీకృత జాతీయ స్ఫూర్తి లేకపోవడంతో రాచరిక రాష్ట్రాలుగా విభజితమై, పోరాడాల్సి కారణం అయితే,
ఇక.. రెండోది దేశభక్తి కొరవడటం, ఇక్కడి వారే ద్రోహం చేయడం బాగా వుండేదని గుర్తించారన్నారు. ఈ నేపథ్యంలో హెడ్గేవార్ దేశమే ప్రథమం అన్న ఆలోచనను తీసుకొచ్చి, దేశభక్తి నినాదం కాదని, జీవితాంతం కొనసాగించే సంస్కృతి అని చెప్పారని అరుణ్ కుమార్ తెలిపారు.
ఇక మూడోది… క్రమశిక్షణ, సంఘటణ లేకపోవడం. వేదాల్లో పేర్కొన్న జాతీయ స్ఫూర్తి, ఒకే స్ఫూర్తి, ఒకే లక్ష్యం అన్న దానిని సమాజం వదిలేసిందని, దీని ద్వారా ఆత్మగౌరవం, స్వాభిమానం క్షీణించిందని, దీని ద్వారా పరాధీన మనస్తత్వం పెరిగిపోయిందన్న విషయాలను డాక్టర్జీ గుర్తించారన్నారు.
ఇక నాలుగోది… వ్యక్తి నిర్మాణం, మనమెవరో, మన మూలాలను తెలుసుకోవడం
ఈ నాలుగు అంశాలను ఆధారంగా చేసుకొనే డాక్టర్జీ సంఘ్ ను స్థాపించారని, నిత్య శాఖ ద్వారా వ్యక్తి నిర్మాణాన్ని చేపట్టారన్నారు.
సంఘ్ మార్గం ఎప్పుడూ సులభం కాదని, సంఘర్షణ, ఉదాసీతన, వ్యతిరేకత అన్న అంశాలను దాటుకొని, వికాసం చెందిందన్నారు. సంఘ్ ఎవ్వరినీ శత్రువుగా పరిగణించదని, అందుకే ప్రత్యర్థులు కూడా నేడు సంఘ్ ను ప్రశంసిస్తున్నారని వివరించారు.
ఈ సందర్భంగా లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మాటలను ఉటంకిస్తూ ‘‘ నా సంకల్పాన్ని ఏ సంస్థ అయినా పూర్తి చేస్తుందనుకుంటే అది సంఘ్ మాత్రమే’’ అని అన్నారని గుర్తు చేశారు. సంఘ్ నుంచి చేసే కార్యక్రమాలకు సంఘ్ ఎప్పుడూ క్రెడిట్ తీసుకోలేదని, ఇదే సంఘ్ ముఖ్య లక్షణమని వివరించారు. ప్రతి పౌరుడికి కూడా ఆహారం, దుస్తులు, ఇల్లు, ఉపాధి, ఆరోగ్యం అన్న మౌలిక వసతులు అందుబాటులో వుండాలన్నదే సంఘ్ కోరుకుంటుందన్నారు.
సమాజంలో ఎక్కడైతే లోపాలు వున్నాయో.. అక్కడ సంఘ్ సేవా స్ఫూర్తితో పనిచేస్తుందని, ప్రతి ఒక్కరి బాధ తన బాధగా ఆవాహన చేసుకుంటుందన్నారు. ఇదే భారత ఆత్మ అని, అందుకే భారత్ కి ప్రపంచంలో అంత ఆదరణ వుందన్నారు. ఇక పంచపరివర్తన్ గురించి మాట్లాడుతూ కేవలం ప్రసంగాల ద్వారా కాకుండా జీవన శైలిలో చిన్న చిన్న మార్పుల ద్వారానే నిజమైన మార్పు సాధ్యమన్నారు.





