
ఎంత అపచారం! అన్న తీరులో కేరళ కాంగ్రెస్ పార్టీ శాఖ గగ్గోలు పెట్టింది. గురువాయూర్ మునిసిపాలిటీ చేసిన పని చూసి కాంగ్రెస్ తలడిల్లిపోయింది. ఏకేజీ స్మారక ద్వారం వద్ద ఏర్పాటు చేసిన క్రిస్మస్ చెట్టును చూచి శతాధిక సంవత్సరాల పార్టీ బాగా బాధపడింది. అదేమిటి? క్రిస్మస్ వేళ, క్రిస్మస్ చెట్టు పెడితే కాంగ్రెస్ బాధపడి పోవడం ఎందుకు? అలా జరక్కూడదే! కానీ ఆ క్రిస్మస్ చెట్టును తయారు చేయడానికి మునిసిపాలిటీ ఖాళీ బీరు సీసాలు ఉపయోగించింది. కేరళ త్రిశ్చూరు జిల్లాలోని ఈ మునిసిపాలిటీ లెఫ్ట్ డెమాక్రటిక్ అలయెన్స్ చేతిలో ఉంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ మునిసిపాలిటీని ఎల్డీఎఫ్ గెలుచుకుంది. తొలి సమావేశం సందర్భంగా ఈ ఘనకార్యం నిర్వహించింది. దీనితో కాంగ్రెస్ బీరు సీసాలతో క్రిస్మస్ చెట్టు పెట్టడం ఏమిటి అంటూ నిలదీశారు. సమావేశం ముగిశాక కాంగ్రెస్, ఇతర వామపక్షేతర సభ్యులు మునిసిపాలిటి కార్యదర్శి హెచ్. అభిలాష్ దగ్గరికి వెళ్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేమిటి అసలు అన్నారు. అందుకు ఆయన సమాధానం ఇలా ఉంది. వాడేసిన వస్తువులను సృజనాత్మకంగా ఎలా తిరిగి ఉపయోగించుకోవచ్చునో తెలియచేయడానికి ఇలా క్రిస్మిస్ చెట్టును మొలిపించామన్నాడు. మీ సృజనాత్మకత తగలెయ్యా! ఇలా మద్యం సీసాలతో క్రిస్మస్ చెట్టును తయారు చేసి సమాజానికి ఎలాంటి సందేశం పంపిద్దామని అనుకుంటున్నారు? అని వాపోయారు కాంగ్రెస్ సభ్యులు. అసలు క్రిస్మస్ అంటే లోకానికి వెలుగు ఇచ్చే పండుగ. ఆ వెలుగును బీరు సీసాలతో సాధించాలనా మీద ఉద్దేశం అని నిలదీశారు. ముందు ఆ చెట్టును తొలగించండి అని కూడా కోరారు. ఒక్కటే ప్రశ్న. అయ్యప్ప గుడిలో అన్ని అక్రమాలు, అప్రాచ్యపు పనులు జరిగినా ఏనాడూ నోరెత్తని కాంగ్రెస్ వారు, బీరు సీసాల క్రిస్మిస్ చెట్టు చూసి అంత కలవరపడిపోవడం ఎందుకో అర్ధం చేసుకోవడం కష్టమేమీ కాదు.
క్రిస్మస్ చెట్టుకు కేరళ కాంగ్రెస్ నిరసన! కౌన్సిల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కొందరు ఇతర పార్టీల సభ్యులు కూడా





