News

హిందూ యువకుడిపైన దాడిపై ప్రపంచం స్పందించాలి : అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా

145views

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపూ చంద్ర దాస్‌ హత్యను అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు రో ఖన్నా ఖండించారు. ఇలాంటి విద్వేషపూరిత చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచం తన గొంతుకను వినిపించాలని ఎక్స్‌ వేదికగా పిలుపునిచ్చారు. అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి కూడా ఈ ఘటనను తప్పుబట్టారు. బంగ్లాదేశ్‌లోని అన్ని వర్గాల భద్రత కోసం ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మత, భావ ప్రకటన స్వేచ్ఛకు అమెరికా మద్దతిస్తుందన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్‌ వ్యక్తం చేసిన ఆందోళనలను ఢాకా ఖండించింది. ఒకట్రెండు నేరపూరిత ఘటనలను భూతద్దంలో చూపించి బంగ్లా వ్యతిరేక ప్రచారానికి భారత్‌ పాల్పడుతోందని ఆరోపించింది. భారత్‌లోనే మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఎదురుదాడి చేసింది.