News

బుందేలీ భాషలో ‘రామచరిత మానస్‌’ను అనువాదం చేసిన లాల్‌ఖాన్‌

256views

సంస్కృతంలోని వాల్మీకి రామాయణం స్ఫూర్తితో తులసీదాస్‌ అవధీ భాషలో ‘రామచరిత మానస్‌’ రాయగా.. దీనిని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన లాల్‌ఖాన్‌ బుందేలీ భాషలోకి అనువదించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా బిజ్నా గ్రామానికి చెందిన లాల్‌ఖాన్‌ మాట్లాడారు. ‘‘బాల్యం నుంచే రామాయణం నా జీవితంలో భాగమైపోయింది. హిందు, ముస్లిం తేడాలు నాకు తెలియదు. రామచరిత మానస్‌ను స్థానిక భాషలోకి అనువదిస్తే ఎక్కువమంది చదువుతారన్న గురువు ఆజ్ఞతో ఈ పనిని పూర్తి చేశాను. దీనికి మూడేళ్లు పట్టింది. మనమందరం సామరస్యంగా బతకడం పూర్వీకులు నేర్పారు. దీన్ని ముందు తరాలకు అందించాలి’’ అన్నారు. రామాయణ పారాయణం, రామ్‌లీలా ప్రదర్శన, భజనలు పాడటం తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిందని అంటారాయన. ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేస్తున్న లాల్‌ఖాన్‌ తన బాల్యంలో వినోబాభావే భూదాన్‌ ఉద్యమంలోనూ పాల్గొని పాటలు పాడారు.