News

పాక్ కోసం “ధురంధర్”..! సినిమాని బ్యాన్ చేసిన గల్ఫ్ దేశాలు..

134views

ధురంధర్’ (సినిమాలో రణ్‌వీర్‌ సింగ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. భారతదేశంలో ఈ సినిమా ఆకట్టుకుంటుండగా.. ఆ ఆరు దేశాల్లో మాత్రం దీనిపై నిషేధం విధించినట్లు తెలుస్తుంది. ఆరు గల్ఫ్‌ దేశాల్లో ‘ధురంధర్‌’ సినిమాను బ్యాన్ చేసినట్లు సమాచారం.

అయితే, ‘ధురంధర్‌’ సినిమాను బహ్రెయిన్‌, కువైట్‌, ఒమన్‌, ఖతార్‌, సౌదీ అరేబియాతో పాటు యూఏఈలు నిషేధించినట్లు బాలీవుడ్‌ మీడియా తెలియజేసింది. బాలీవుడ్‌కు కీలక మార్కెట్ అయిన గల్ఫ్‌లోని అన్ని థియేటర్లలో ఈ మూవీని విడుదల చేయడానికి నిర్మాతలు ఎంత ప్రయత్నించిన ఫలితం దక్కలేదని తెలిపారు. ఇక, కొన్నిచోట్ల అసలు పర్మిషన్ కూడా లభించకపోవడంతో దీన్ని కొన్ని థియేటర్లకు మాత్రమే పరిమితం చేసినట్లు చెప్పారు. కాగా, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఈ సినిమాను తెరకెక్కించడం వల్లే ఆయా దేశాలు దీన్ని బ్యాన్‌ చేసినట్లు సమాచారం.

కాగా, గల్ఫ్‌ దేశాల్లో ఎదురు దెబ్బ తగిలినప్పటికీ ఈ మూవీ భారత్ లో మాత్రం కలెక్షన్ల సునామీ కురిపిస్తోంది. వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరబోతుంది. ఇప్పటివరకూ రూ.185 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రణ్‌వీర్‌ సింగ్‌ కథనాయకుడిగా నటించిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీని ఆదిత్యధర్‌ తెరకెక్కించాడు