
179views
పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 14 వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పేర్కొంది. తితిదే ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా తిరుపతితో పాటు రాష్ట్రంలో 76, తెలంగాణలో 57, తమిళనాడులో 73, కర్ణాటకలో 21, పుదుచ్చేరిలో 4, దిల్లీ, ఒడిశాలో ఒక్కో కేంద్రంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం బదులు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కేటీ రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు.





