News

స్పర్శ దర్శనం భక్తులకు ఉచిత లడ్డూలు

120views

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం పాలక మండలి చైర్మన్ రమేష్ నాయుడు శుభవార్త తెలిపారు. శ్రీశైలంలో సోమవారం నుంచి స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు ఉచితంగా రెండు లడ్డూలు అందిస్తామని పేర్కొన్నారు. రూ. 300 టికెట్ తీసుకున్న భక్తులకు ఒక్క లడ్డూ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.

భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందజేయడం కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. పరమేశ్వరుడును దర్శించుకోవడానికి భక్తులు ఇప్పటికే భారీగా శ్రీశైలం చేరుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టంగా భద్రత చర్యలు చేపట్టారు.