
2026 జనవరి 3 నుండి ఫిబ్రవరి 15 వరకు జరిగే వార్షిక మాఘ మేళాకు సంబంధించిన సన్నాహక పనులను సీఎం యోగి సమీక్షించారు. ఈ సంవత్సరం మాఘమాసంలో ప్రయాగరాజ్ లో జరిగే మాఘమేళాను అత్యంత వైభవంగా జరిపించాలని అధికారులను ఆదేశించారు.
మహా కుంభమేళా తర్వాత భారతదేశంలో జరిగే అతిపెద్ద వార్షిక ఆధ్యాత్మిక సమావేశాలలో ఒకటైన మాఘమేళా 2025 జనవరిలో ప్రారంభమై నెలన్నర పాటు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి 12 నుండి 15 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా..అందులో దాదాపు 25 లక్షల మంది నెల రోజుల పాటు ప్రయాగ రాజ్ లోనే ఉంటారని అంచనావేస్తున్నారు.
ఇటీవలి మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహించడం ద్వారా పొందిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని, “మాఘ మేళాను అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక సారాంశంతో నిర్వహించడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు.అందుకోసం పరిశుభ్రత, రోడ్లు, డ్రైనేజీ, టాయిలెట్ వ్యవస్థలాంటివి ఏర్పాటు చేయనున్నారు.
గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలమైన పవిత్ర త్రివేణి సంగమంలో ప్రతి సంవత్సరం మాఘ మాసంలో (జనవరి-ఫిబ్రవరి) జరిగే మాఘ మేళా శతాబ్దాలుగా ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.పవిత్రమైన రోజుల్లో పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని , దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు.
ఈ సంవత్సరం, స్నాన తేదీలు సాధారణం కంటే 15 రోజులు ముందుగానే వస్తాయి. ముఖ్యమంత్రి కీలకమైన ఆరు పవిత్ర స్నాన దినాలను (స్నాన్స్) ఈ క్రింది విధంగా ప్రకటించారు





