
“మేం CAA కు మద్దతునిస్తాం” అనే నినాదం ఉన్న పెన్నులు అమ్ముతున్నందుకు కొందరు ముస్లిములు ఆ షాప్ మీద దాడిచేసి షాప్ ను మూయించే ప్రయత్నం చేసిన ఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
చెన్నైలోని ఒక సెల్ ఫోన్లు అమ్మే షాపులో సెల్ ఫోను కొన్నవారికి పెన్నును ఉచితంగా ఇస్తున్నారు. ఆ షాపు వారు కేంద్ర ప్రభుత్వం క్రొత్తగా ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలుపుతూ పెన్నుపై “ WE SUPPORT CAA & NRC” అని వ్రాయించివుండడం చూసిన కొందరు ముస్లుములు గుంపుగా ఆ షాపు వద్దకి వచ్చి షాపుపై దాడి చేసి ఆ షాపును మూయించే ప్రయత్నం చేశారు.
ఇంతలో షాపు యజమాని తనకు తెలిసిన హిందూ మున్నాని నాయకులకు సమాచారమివ్వడంతో హుటాహుటిన వచ్చిన ‘హిందూ మున్నాని’ కార్యకర్తలను చూసి ఆకతాయిల గుంపు పలాయనం చిత్తగించింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.