NewsSeva

సేవా భారతి ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ

896views

నవరి 19 ఆదివారం నాడు విజయవాడ హైందవిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల నిర్వాహకుల అభ్యాస వర్గ జరిగింది .ఈ వర్గలో ఎనిమిది జిల్లాల నుండి 16 మంది ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ వర్గ ప్రారంభంలో ధనుష్ ఇన్ఫోటెక్ ఎం. డి శ్రీ డి.ఎస్.ఎన్ మూర్తి మాట్లాడుతూ  ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యం లేని కారణంగా పట్టభద్రులు ఉన్నప్పటికీ నిరుద్యోగ సమస్య ఏర్పడింది, ఇంకొక పక్క పరిశ్రమలు నైపుణ్యం ఉన్న వ్యక్తుల కొరత కారణంగా ఉద్యోగాలు భర్తీ చేయలేకపోతున్నారని తెలియజేశారు.

తెలంగాణా మరియు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల స్కిల్ డెవలప్మెంట్ ప్యానల్ అడ్వైజర్ శ్రీ సి వి రామన్ వర్గను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎంప్లాయబుల్  స్కిల్స్ నేర్పే కేంద్రాలను ఏర్పరచటమే ఈ వర్గ ఉద్దేశ్యం అన్నారు.   హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజ్ కాన్సెప్ట్ ప్రపంచంలో సక్సెస్ అయిందని, “ఒక మెడికల్ విద్యార్థి తాను చదువుకున్న చదువును చదువు తోపాటు హాస్పిటల్ ద్వారా అప్లై చేయడం వలననే రాణించగలుగుతున్నాడు.  ఇంజనీరింగ్, ఎంసీఏ, బీకాం విద్యార్థులకు వాళ్ళ చదువుకు తగిన అప్లికేషన్ సెంటర్స్ లేని కారణంగా విద్యార్థులు ఉద్యోగాలకు తగిన అర్హత పొందలేకపోతున్నారు. విద్య అంటే కేవలం సర్టిఫికెట్స్ ఇవ్వడమే కాదు వారికి ఇంటర్న్షిప్ ఇచ్చి వృత్తిపరమైన అనుభవం కూడా పొందే అవకాశం కల్పించాల”ని తెలియజేశారు.

సేవా భారతి స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీ పృథ్వీరాజు మాట్లాడుతూ 13 జిల్లాలలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు.  జిల్లా ప్రతినిధుల నుండి నివేదికలను సేకరించి అక్కడ ఉద్యోగానికి ఆధారభూతమైన, ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్య విద్యా కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. అందుకు తగిన విధంగా ఈరోజు వర్గ నిర్వహించినట్లు తెలిపారు.

అనంతరం సేవాభారతి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె ఎస్ ఎన్ చారి సముద్రతీర ప్రాంతాలలో ఉన్న జిల్లాలలో ఆక్వాకల్చర్, సీ ఫుడ్ ప్రాసెసింగ్  విశాఖపట్నం జిల్లా పాడేరు లో టూరిజం, మార్కెటింగ్, కాఫీ ప్రోసెసింగ్ లాంటి  కోర్సులకు శిక్షణ , ప్రత్యేకించి కామర్స్  స్టూడెంట్స్ కి బ్యాంకింగ్ ఫైనాన్స్ (బి ఎఫ్ ఎస్ ఐ) మీద శిక్షణ , మొబైల్ రిపేరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ పరికరాల రిపేరింగ్ వంటి కోర్సుల ద్వారా ఒక సంవత్సరంలో కనీసం 10 వేల మందికి ఉద్యోగ ఉపాధి కల్పన తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.