
రాష్ట్రం, దేశంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోందని రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అన్నారు. ఇటీవల మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఆయన పర్యటించారు. ఎన్ కౌంటర్ లలో భారీ సంఖ్యలో స్వాధీనం చేసుకున్న ఆయుధ సామ్రాగ్రిని ఆయన పరిశీలించారు.ఈ ఆపరేషన్ విజయం లో పాల్గొన్న వివిధ విభాగాల పోలీసులను ఆయన అభినందించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడానికి ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుందని తెలిపారు.చ్చే సంవత్సరం మార్చి నెలలోపు మావోయిస్టు రహిత ఆంధ్ర ప్రదేశ్ గా చేస్తామని ఆయన తెలిపారు.మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లతో భద్రతా బలగాలు పెద్ద విజయం సాధించాయి. హిడ్మా మద్వి, టెక్ శంకర్ సహా 13 మంది మావోయిస్టులు మృతిచెందారు. రాష్ట్రంలో 50 మంది వరకు మావోయిస్టులను అరెస్ట్ చేశాం. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టు రహితంగా తీర్చదిద్దుతాం. భద్రతా బలగాలు సాధించిన విజయానికి వారిని అభినందిస్తున్నా’’ అని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అన్నారు. ఇంకా కూలింగ్ కొనసాగుతుందని మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని ఇప్పటికే 50 మందిని అరెస్టు చేసామని 13 మంది మావోయిస్టులు మృతి చెందగా మరికొందరు పరారయ్యారని అన్నారు.





