
విద్యార్థుల్లో నాయకత్వం లక్షణాలు, దేశభక్తి, స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని నింపడానికి, స్వాతంత్ర్య సమర వీరుల జయంతులు, వర్థంతులు నిర్వహించటం ఆనవాయితీగా చేపడుతోంది నంద్యాల జిల్లా, సంఘమిత్ర. ఇందులో భాగంగా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి కార్యక్రమాన్ని సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ చిలుకూరి శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.

ప్రధాన వక్త వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి వీరోచిత గాథను చిన్నారులకు వివరించి స్ఫూర్తిని నింపారు.భారత మహిళా శక్తికి సాధికారతకు నిలువెత్తు రూపం అస్థిత్వం, ఆత్మాభిమానం కోసం ఖడ్గం చేపట్టిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అని కొనియాడారు. మహిళలు సమాజంలో చైతన్యవంతం కావాలని అన్నిరంగాల్లో మహిళలకు భాగస్వామ్యం ఉండాలని, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోస్టల్ డిపార్ట్మెంట్ శ్రీమతి వై శైలజ, ప్రధాన వక్తగా శ్రీమతి కరణం శైలజ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర ఉపాధ్యక్షులు శ్రీ జె వెంకటేశ్వర్లు సంఘటన కార్యదర్శి శ్రీమతి ఎస్.విజయశ్రీ , సహకార్య దర్శి శ్రీ కరణం సుందర్ రావు, కోశాధికారి శ్రీ సముద్రాల నాగరాజయ్య, సభ్యులు శ్రీ ఉసిరికాయలు వెంకట రమణయ్య గౌడ్, శ్రీమతి వెంకటేశ్వరమ్మ, శ్రీ మోదాల రామాంజనేయులు పాల్గొన్నారు.





