News

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి

275views

నంద్యాల పట్టణంలోని స్థానిక గిరినాథ్ సెంటర్ సమీపంలోని ఈఎస్ సీ పాలిటెక్నిక్, జూనియర్ కళాశాల నందు, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నంద్యాల భాగ్ కన్వీనర్ శ్రీ లక్ష్మీ నరసింహ మాట్లాడుతూ ఝాన్సీ లక్ష్మీబాయి అతి చిన్న వయసులోనే కత్తి సాము, కర్రసాము, గుర్రపు సవారీ లాంటి యుద్ధవిద్యలు నేర్చుకుని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించి దేశం కోసం ప్రాణాలను త్రుణ ప్రాయంగా అర్పించిన వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయిని మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అకృత్యాలు, అఘాయిత్యాలు పట్ల స్వయంగా తనని తాను రక్షించు కో గలిగేలా మాత్రమే కాకుండా సాటి వారిని కూడా కాపాడే స్థాయిలో తయారవ్వాలని పిలుపు నిచ్చారు.

సదరు కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ శైలేంద్ర కుమార్, శ్రీ చందు , శ్రీ భరత్ పలువురు విద్యార్థిని, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.