News

ASI బృందం పనిచేయకుండా సంభాల్ మసీదు వ్యక్తుల ఆటంకం

160views

యూపీ సంభాల్ లోని షాహి జామా మసీదును ASI బృందాన్ని అడ్డుకున్నందుకు మసీదు సిబ్బందిపై అధికారులు కేసులు నమోదు చేశారు. ASI బృందాన్ని పనిచేయకుండా ఆటంకం కలిగిస్తున్నారని అందులో పేర్కొన్నారు. మసీదు తనిఖీ కోసం, ముందస్తు అనుమతులు లేని, సాధారణ విధులను అంచనా వేయడానికి తాము మసీదుకి వెళ్లామని, కానీ తమ విధులకు అక్కడి సిబ్బంది ఆటంకం కలిగించారని సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ వినోద్ సింగ్ రావత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బృందం ప్రధాన గుమ్మటం వద్దకు చేరుకున్న క్షణంలో, ఉద్యోగులు హఫీజ్ మరియు మహ్మద్ ఖాసిం (కాషిఫ్) ఖాన్ వారి మార్గాన్ని అడ్డుకున్నారని, మసీదులోకి రానివ్వలేదని, అత్యంత దుర్భాషలాడినట్లు కూడా తెలిపారు. వారు దుర్భాషలాడినా, తాము శాంతియుతంగానే ముందుకు సాగడానికి ప్రయత్నించామని, అయినా.. తమను అడ్డుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఘర్షణ మరింత పెరిగి, వాతావరణం భయానకాన్ని తలపిస్తుందన్న కారణంతో తాము మసీదులో తనిఖీని నిలిపేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా భారతీయ శిక్షాస్మృతి 132, 352, 351 (2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు దీనిని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించారు.