News

చైనా కళాకారుల ‘రామాయణం’

154views

భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ చైనాలోనూ ఆదరణ పొందుతోంది. ప్రముఖ చైనా పండితుడు దివంగత ప్రొ. జి షియాన్‌లిన్‌ అనువాదం చేసిన ‘ఆదికావ్యం- ది ఫస్ట్‌ పోయం’ను చైనా కళాకారుల బృందం ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను చైనాలోని భారత రాయబార కార్యాలయం సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

సంగీతం ఇండియా ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో బీజింగ్‌లో నిర్వహించిన ఈ ప్రదర్శనకు.. చైనా భరతనాట్య కళాకారుడు జిన్‌ షాన్‌షాన్‌ దర్శకత్వం వహించారు. దాదాపు 50 మంది స్థానిక కళాకారులు ఇందులో భాగస్వామ్యమయ్యారు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు దీన్ని వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఓ అద్భుతమైన సాంస్కృతిక సంగమంగా భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను చైనాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో షేర్ చేసింది. సంగీతం ఇండియా ఆర్ట్స్ ఆధ్వర్యంలో బీజింగ్ లో నిర్వహించిన ఈ ప్రదర్శనకు.. చైనా భరతనాట్య కళాకారుడు జిన్ షాన్షాన్ దర్శకత్వం వహించారు. భారీ సంఖ్యలో ప్రేక్షకులు ‘రామాయణం’ను వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఓ అద్భుతమైన సాంస్కృతిక సంగమంగా భారత రాయబార కార్యాలయం పేర్కొంది.