News

సంఘమిత్ర ఆధ్వర్యంలో ఉక్కు మనిషి జయంతోత్సవం

140views

నంద్యాల జిల్లా, స్థానిక సంఘమిత్ర సేవా సమితి వాసంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 150వ జయంతి స్ఫూర్తి దాయకంగా జరిగింది. ఇందులో భాగంగా కార్యవర్గ సభ్యులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ఉక్కు మనిషి ప్రసిద్దికెక్కిన స్వదేశీ సంస్థానాలను భారత్ లో విలీనం చేసి తదుపరి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ధైర్య స్థైర్యాలు, దేశభక్తి, నిరాడంబరత ఈ నాటి యువతకు ఆదర్శం కావాలి అన్నారు.

ఈ సదరు కార్యక్రమంలో సంఘమిత్ర అధ్యక్షులు శ్రీ చిలుకూరి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు శ్రీ జీనపల్లి వెంకటేశ్వర్లు, సహకార దర్శి శ్రీ కరణం సుందర్ రావు, కోశాధికారి శ్రీ సముద్రాల నాగరాజయ్య, సభ్యులు శ్రీ ఉసిరికాయల వెంకట రమణయ్య గౌడ్ మరియు శ్రీ మోదాల రామాంజనేయులు తదితరులు పాల్గొనడం జరిగింది.