NewsSeva

భారత్ ను జగద్గురువుగా నిలపాలి – శ్రీ త్రినాథ్

52views

స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని విజయవాడ రామవరప్పాడు రింగ్ సమీపంలోని స్వామి వివేకానంద విగ్రహాన్ని సేవా సమరసతా ఫౌండేషన్ కార్యకర్తలు పుష్పమాలలతో అలంకరించి స్వామి వివేకానంద జయంతిని  ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సేవా సమరసత ఫౌండేషన్(SSF) రాష్ట్ర కార్యదర్శి శ్రీ త్రినాథ్ మాట్లాడుతూ భారతమాత కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన భారత ప్రియ పుత్రుడు స్వామి వివేకానంద అని, భారతీయులందరూ ఆయన చూపిన బాటలో నడవాలని తెలిపారు.

నేడు భారతీయ సమాజం ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ఈ సమయంలో అందరమూ సంఘటితంగా నిలచి స్వామి వివేకానంద కోరుకున్నట్లుగా భారత్ ను జగద్గురువుగా నిలపాలని పిలుపునిచ్చారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.