News

నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు

164views

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలో మృతి చెందారంటే తాను నమ్మనని ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌ అన్నారు. అందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు లేకపోయినా నమ్మబోనన్నారు. రామనాథపురం జిల్లా పసుంపొన్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు ముత్తురామలింగ దేవర్‌కు ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… నేతాజీకి బలమైన మద్దతుదారుడు. ఆయన తన జీవితకాలంలో ఎన్నడూ అబద్ధమాడలేదు. ఆయన, ‘నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోలేదు. ఆయనను నేను కలిశాను’ అని చెప్పారు. నేముత్తురామలింగ దేవర్‌ చెప్పారన్నారు. దేవర్‌ మాటలను తాను నమ్ముతున్నానని, ఆయన తన జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదని రాధాకృష్ణన్‌ అన్నారు. దేవర్‌ తన రాజకీయ ప్రయాణంలో ఆధ్యాత్మికతపైనా దృష్టి పెట్టారని, అదే ఆయన గొప్పతనమన్నారు.