
744views
అనకాపల్లి సమీపంలోని గుడిలోవలో గల రాష్ట్ర సేవా సమితి ఆధ్వర్యంలో నడిచే మాధవ విద్యా విహార పాఠశాలలో స్వామి వివేకానంద 157వ జయంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా RSS అనకాపల్లి నగర కార్యవాహ శ్రీ MJP కొండలరావు పాల్గొన్నారు. ముఖ్య వక్తగా శ్రీ ఎ. సన్యాసిబాబు పాల్గొని ప్రసంగించారు.

అతి పిన్న వయసులోనే తన అద్భుత ప్రసంగాలతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించి హిందూ సంస్కృతి, ధర్మం యొక్క గొప్పతనాన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన స్వామి వివేకానంద అన్ని తరాల భారతీయులకు ఆదర్శ పురుషుడని శ్రీ సన్యాసిబాబు పేర్కొన్నారు. కేవలం 39 సంవత్సరాల అతి పిన్న వయస్సులో పరమపదించిన స్వామీ వివేకానంద 500 ఏండ్లకు సరిపడా కార్యాన్ని నిర్వర్తించిన కారణ జన్ములని కొనియాడారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





