
194views
రాజస్థాన్ రాజధాని జైపూర్లోని హింగోనియా గోశాలలో (పునరావాస కేంద్రం) ఆవుల సంరక్షణ కోసం 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సంరక్షణ యూనిట్‌ను ప్రారంభించారు. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న పశువులకు ఇక్కడ చికిత్స చేస్తారు. 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక పశువైద్య భవనం కూడా నిర్మితమవుతోంది. ఈ పునరావాస కేంద్రంలో సుమారు 18,000 పశువులు సంరక్షణ పొందవచ్చు. గాయపడిన, అనారోగ్యంతో ఉన్న కొన్ని వందల పశువులను జైపుర్ మున్సిపల్ కార్పొరేషను సిబ్బంది, జంతు ప్రేమికులు ప్రతిరోజూ ఈ కేంద్రానికి తీసుకువస్తారు. హింగోనియాను దేశంలో గోసేవకు ఆదర్శవంతమైన నమూనాగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పునరావాస కేంద్రం మేనేజరు ప్రేమ్ ఆనంద్ తెలిపారు.





