
180views
సాధారణంగా ఆలయాల్లో దేవుళ్లకు పూజలు నిర్వహిస్తుంటారు. కానీ.. ఒడిశాలో కేంద్రపాడ జిల్లా బాబాకర్పుర్ గ్రామంలోని ఓ గుడిలో మాత్రం మహాకవి కాళిదాసు విగ్రహాన్ని పూజిస్తుంటారు. 200 ఏళ్లకుపైగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ వేద మంత్రాలకు బదులు మేఘదూతం, అభిజ్ఞాన శాకుంతలం, కుమార సంభవం వంటి కాళిదాసు రచనల్లోని పద్యాలను పఠించడం గమనార్హం. అర్చకుడికి సంస్కృత విద్య తప్పనిసరి.
ఈ ఆలయం వెనుక ఓ కథనాన్ని గ్రామస్థులు చెబుతుంటారు. 1802లో బలరామ్ అనే రైతు పొలం దున్నుతుండగా కాళిదాసు రాతి విగ్రహం బయపడింది. ఆ రోజు రాత్రి కాళిదాసు ఆయన కలలోకి వచ్చి తన విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయాలని సూచించారు. అప్పటినుంచి ఆ విగ్రహానికి పూజలు చేయడం ప్రారంభమైందని వివరిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో కాళిదాసు రచనలు, పోటీ పరీక్షల పుస్తకాలతో కూడిన ఓ గ్రంథాలయాన్నీ ఏర్పాటు చేయడం విశేషం.





