
నంద్యాల జిల్లా విశ్వహిందూ పరిషత్, సామాజిక సమరసతా ఆధ్వర్యంలో నంద్యాలలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వాల్మీకి మహర్షికి పూలమాల సమర్పించి సభా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి యావత్ మానవాళికి సర్వోత్తమ ధార్మిక మార్గాన్ని నిర్దేశించే శ్రీ మద్ రామాయణ మహా కావ్యాన్ని అందించిన గొప్ప మహర్షి అని తెలిపారు.
ఆర్ఎంపీ డాక్టర్ శివ మాట్లాడుతూ, సదరు కార్యక్రమంలో లో పాల్గొనటం తన అదృష్టంగా తెలిపారు. డాక్టర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రామాయణ గొప్పతనం గురించి వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం గురించి మార్గదర్శనం చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ వై యన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ ప్రౌడ ప్రముఖ్ శ్రీ రాం ప్రసాద్ , విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షులు శ్రీమతి సుహాసిని, శ్రీ సిరిగిరి కృష్ణ, శ్రీ వరప్రసాద్ శ్రీ కిరణ్, శ్రీ సుజన్ తదితరులు పాల్గొన్నారు.