
ప్రస్తుత సమాజంలో హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరు ఐక్యంగా సంఘటితంగా ఏకమై పరిరక్షించుకుందామని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ – ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో మండల కేంద్రమైన చిప్పగిరిలోని ఆర్ఎస్ఎస్ ఖండ ప్రముఖ రాజశేఖర్, రమేష్ బాబు, వీఆర్ఎ అశోక్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ నుండి భోగేశ్వర స్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ గణవేష్ తో కవాతు నిర్వహిస్తూ నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో గ్రామంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నినాదాలతో మారుమోగి వీరికి గ్రామస్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని మద్దతుగా నిలిచారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్-RSSను 1952 సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం నాగపూర్ నందు డాక్టర్ బలీరామ్ హెడ్గేవార్ స్థాపించారన్నారు.హిందూ సమాజాన్ని ఐక్య పరచడం క్రమశిక్షణను పెంపొందించడం,హిందూ ధర్మాన్ని పరిరక్షించడం ఆర్ఎస్ఎస్ లక్ష్యమని వారు వివరించారు. కనుక హిందూ ధర్మంపై ఆసక్తి ఉన్న వారందరూ ఆర్ఎస్ఎస్ చేసే కార్యక్రమాలలో స్వచ్ఛందంగా పాల్గొని తమ వంతు మద్దతు నిలవాలని వారు వివరించారు.