News

హిందువులే టార్గెట్‌గా భారత్‌లో అమెరికన్‌ల భారీ కుట్ర!

37views

భారతదేశంలో అగ్రరాజ్యం అమెరికన్ పౌరుల అనుమానాస్పద కార్యకలాపాలపై మరోసారి ప్రశ్నలు బయటికి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని భివాండిలో చట్టవిరుద్ధమైన మత మార్పిడులను ప్రోత్సహించినందుకు ఒక అమెరికన్ పౌరుడిని అక్కడి అధికారుల అరెస్ట్ చేశారు. ఆయన రిటైర్డ్ యుఎస్ ఆర్మీ మేజర్‌ అని అధికారులు పేర్కొన్నారు. దీనికంటే ముందు మణిపూర్‌లో డ్రోన్లు, రక్షణ పరికరాలను సరఫరా చేశాడనే ఆరోపణలపై ఒక మాజీ అమెరికా సైనికుడిని భద్రతా అధికారులు అరెస్టు చేశారు. అసలు నిందితుల ఉద్దేశ్యాలు ఏమిటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మహారాష్ట్రలో యూఎస్ మాజీ సైనికుడికి పని ఏంటి?
మహారాష్ట్రలోని థానే ఉందిభివాండి తాలూకాలో అక్రమ మత మార్పిడి కేసు వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో అమెరికన్ పౌరుడు జేమ్స్ వాట్సన్ ఒక్కరు. 58 ఏళ్ల జేమ్స్ వాట్సన్ అమెరికా సైన్యంలో మాజీ మేజర్ స్థాయిలో పని చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వాట్సన్ వ్యాపార వీసాపై భారతదేశానికి వచ్చారు, కానీ ఆయన చట్టవిరుద్ధమైన మత మార్పిడులలో పాల్గొన్నాడని పోలీసులు వెల్లడించారు. హిందూ మతం మూఢనమ్మకాలపై ఆధారపడి ఉందని, క్రైస్తవ మతంలోకి మారడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని వాట్సన్ గ్రామస్థులకు చెప్పాడనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ మత మార్పిడుల నేపథ్యంలో ఆయనపై పోలీసులు సెక్షన్లు 299 (మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశించిన దుర్మార్గపు చర్య), 302 (మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశించిన ఉద్దేశపూర్వక, దుర్మార్గపు చర్యలు), విదేశీయుల చట్టం (వీసా నియమాల ఉల్లంఘన), మహారాష్ట్ర 2013 నాటి బ్లాక్ మ్యాజిక్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

మణిపూర్‌లో ఏం జరిగిందంటే..
గత ఏడాది డిసెంబర్ ప్రారంభంలో.. 40 ఏళ్ల అమెరికన్ మాజీ సైనికుడు డేనియల్ స్టీఫెన్ కోర్నీ గురించి సంచలన వార్తలు వెలువడ్డాయి. పలు నివేదికల ప్రకారం.. కోర్నీ మణిపూర్‌లోని కుకి ఉగ్రవాదులకు డ్రోన్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను విక్రయించారని పేర్కొన్నాయి. మణిపూర్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, హింస చెలరేగుతున్న ప్రాంతాలను ఆయన సందర్శించినట్లు చూపించే వీడియో తన యూట్యూబ్ ఛానెల్‌ “ఫూల్ ఫర్ క్రైస్ట్”లో పోస్ట్ చేస్తే అది వైరల్ అయ్యింది. పలు నివేదికల ప్రకారం.. కోర్నీ కుకి పౌరులకు సహాయ సామగ్రిని, అలాగే డ్రోన్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను విక్రయించారని వెల్లడించాయి. వీటిని వాళ్లు నిఘా, మెయిటీ హిందువులపై దాడులకు ఉపయోగించారని నివేదికలు పేర్కొన్నాయి.

అసలు నిందితుల ఉద్దేశ్యం ఏమిటి ?.
భారత్‌లో ఇప్పటి వరకు పట్టుబడిన ఇద్దరు అమెరికన్‌లు కూడా యూఎస్ సైన్యంలో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్లు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. మణిపూర్‌లో చోటు చేసుకున్న జాతి హింసకు అక్కడ అరెస్ట్ అయిన అమెరికన్‌కు సంబంధం ఉండటం, అధికారులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఈ రెండు సందర్భాల్లోను నిందితులు భారత అంతర్గత భద్రతకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించారని విశ్లేషకులు చెబుతున్నారు. మణిపూర్‌లో ఉగ్రవాదులకు ఆయుధాలు సమకూర్చడం, మహారాష్ట్రలో అక్రమ మతమార్పిడి ప్రయత్నాలు రెండూ భారతదేశ అంతర్గత స్థిరత్వానికి ముప్పుగా పరిణమిస్తాయని అన్నారు . డేనియల్ కార్నీ, జేమ్స్ వాట్సన్ వంటి వ్యక్తులకు అమెరికా సైనిక సంబంధాలు యాదృచ్చికంగా చూడలేమని కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతదేశం వంటి బహుళ సాంస్కృతిక దేశంలో తమ ప్రభావాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తున్న మత సంస్థల విస్తరణలో ఇది ఒక భాగం కావచ్చనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.