
మాతృభూమి పట్ల భక్తి, త్యాగం, కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి విజయాదిత్య పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ముఖ్యవక్తగా అయన ప్రసంగిస్తూ, దేశంలో 1925 విజయదశిమి నాడు ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలను పూర్తి చేసుకుందన్నారు. సమాజాన్ని సంఘటితం చేసేందుకు సంఘం పని చేస్తుందన్నారు. భారతీయులు బలహీ నతలు, అనైక్యతను విడనాడాలన్నారు. ఆర్ ఎస్ఎస్ నిత్య శాఖ ద్వారా ఇవన్ని సాధ్యమన్నారు. ఆర్ఎస్ఎస్ దేశ సౌభాగ్యం కోసం పనిచేస్తున్న సంస్థగా ఆయన పేర్కొ న్నారు. సమాజంలో పంచ పరివర్తన్ ద్వారా సంఘం మార్పు చేసేందుకు ప్రయత్నం ప్రారంభించిందన్నారు. గ్రామస్థాయిలో పంచవరివర్తన్ లో భాగంగా సామరస్యం, కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ, స్వదేశి, పౌర విధులకు ప్రాధాన్యత ఇచ్చారని విజయాదిత్య వివరించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఈవో టి రాజశేఖర రెడ్డి, ఎంపీటీసీ సామాజిక కార్యకర్త పి కృష్ణ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నాగబ్రహ్మాచారి, విశ్వశ్వరరావు, రమేష్, నాగిరెడ్డి, రమణా రెడ్డి, మల్లికార్జున్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
చీమకుర్తిలో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్దివేడుకలు
ఆర్ఎస్ఎస్ సంస్థ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శతాబ్ది వేడుకలను చీమకుర్తి పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ వైద్యుడు బి.జవహర్ మాట్లాడుతూ భారతదేశం విశ్వగురుగా విరాజిల్లాలని ఆకాంక్షించారు. వందేళ్లగా దేశ ఔన్నత్యాన్ని కాపాడటానికి ఆర్ఎస్ఎస్ అందించిన సేవలను కొనియాడారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయ ప్రముఖ్ వి. మార్కండేయులు, ఖండ కార్యవాహ వేలూరు వెంకట మధుప్రసాద్, వీవీశివారెడ్డి, ఉపాసకులు కృష్ణస్వామి, గుండా శ్రీనివాసరావు, మాజేటి హనుమాన్, చలువాది పార్థసారథి, వెల్లంపల్లి రంగారావు, సుబ్బ య్య, గుణప్రసాద్, పుత్తూరి శ్రీనివాసరావు, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.