News

దేవాలయాల నిర్మాణంపై వైఎస్ షర్మిల వ్యాఖ్యలను ఖండించిన సమరసత సేవా ఫౌండేషన్ 

215views

సమరసత సేవా ఫౌండేషన్ 

ఆంధ్రప్రదేశ్ 

ప్రచురణార్ధం 

 

శ్రీమతి షర్మిలా? మీరు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలా? క్రైస్తవ మత ప్రచారకురాలా?

తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ దార్మిక సంస్థ, హిందూ భక్తులు సమర్పించిన నిధులతో నడచే సంస్థ, ఇది ప్రభుత్వ నిధులతో నడచే సంస్థ కాదు,

అనేక గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో హిందువులు తమకు గుడి లేదనీ, తమకు గుడి కావాలని కోరారు, మేమూ ఎస్సీ హిందువులము, మేము మా గ్రామంలో గుడి కట్టుకున్నాము, మేము అర్చకులము కూడా! అలాగే మాలాగే అనేక మంది ఎస్సీ హిందువులు కోరిన మీదట తి,తి,దే,గుడులను కట్టించింది, పాఠశాలలు కట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, తి,తి,దే, దేవస్థానములుది కాదు..

గతంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు YS రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ప్రజల సొమ్ముతో క్రైస్తవ మత ప్రచారకులకు జీతాలు ఇచ్చారు, ఇది సెక్యులరిజంకు వ్యతిరేకం,దారి తప్పినది కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం, చాలా గ్రామాల్లో ఎస్సీ కాలనీల్లో క్రైస్తవ కుటుంబాల దామాషాకు మించిన సంఖ్యలో చర్చిలు ఉన్నాయి. ప్రభుత్వాల నియమాలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా క్రైస్తవ సంఘాలు చర్చీలను నిర్మిస్తున్నవి, చట్టాన్ని గౌరవించి వాటిని ఆపించండి, మీరు క్రైస్తవ మత ప్రచారకురాలా? హిందూ గుడుల నిర్మాణంకు ఎందుకు వ్యతిరేకిస్తారు?

ఇట్లు
తాళ్ళూరి విష్ణువు
రాష్ట్ర అధ్యక్షులు సమరసత సేవా ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్
9849459587