News

పౌరసత్వ వ్యతిరేక ప్రదర్శనల వెనుక పాకిస్థాన్?

973views

తమిళనాడులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో పాల్గొన్న వారిలో ఒక్కరికి పాకిస్థాన్ మానవ హక్కుల సంస్థతో సంబంధాలు ఉన్నాయని చెన్నై పోలీసులు తెలిపారు. బసంత్ నగర్లో జరిగిన నిరసన కార్యక్రమాలలో  పాల్గొన్న ఒక మహిళను అరెస్టు చేసి, దర్యాప్తు చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.

చెన్నై నగర పోలీసు కమిషనర్ ఏ కే విశ్వనాథన్ మీడియాతో మాట్లాడుతూ నిరసనకారులలో ఒక మహిళకు పాకిస్థాన్లోని మానవ హక్కుల సంస్థతో సంబంధాలు ఉండే అవకాశం ఉందని తెలిపారు. దీనిని నిర్ధారించేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆమె ఫేస్బుక్ ప్రొఫైల్ పరిశీలించినప్పుడు ఈ విషయం వెల్లడైందని, తాను ఓ మానవ హక్కుల సంఘం కోసం పనిచేస్తున్నట్లు ఆమె ఫేస్బుక్లో పేర్కొన్నారని చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన చాలా నిరసన కార్యక్రమాలతో ఈ మహిళకు సంబంధాలు ఉన్నాయన్నారు. ముగ్గులు వేసి నిర్వహించిన నిరసనలతో కూడా ఆమెకు సంబంధం ఉన్నదని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.