
223views
ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వా ములు కావాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వాండ్రంగి కూడలి ముఖద్వారం వద్ద ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోమాత విగ్రహాన్ని ఆవిష్కరించారు. గోమాతను దర్శించుకుంటే వెయ్యి ఆలయాలు దర్శించు కున్నంత పుణ్యం లభిస్తుందన్నారు. హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూపరిరక్షించాలని తెలిపారు. గోమాతను పూజిస్తే తల్లిని పూజించినట్లేనని చెప్పారు. ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలన్నారు. అంతకుముందు హోమం, ప్రత్యే పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.





