News

పుష్పగిరిలో అరుదైన కాలభైరవుని కుడ్య శిల్పం

162views

వైయస్సార్ కడప జిల్లాలోని ప్రసిద్ధి చెందిన దక్షిణ కాళీ పుష్పగిరి క్షేత్రానికి సమీపంలో ఉన్న శివపాద ఆలయ ముఖ ద్వారంపై ద్వార పాలకుల కుడ్య శిల్పాల్లో కాలభైర వుడి శిల్పం లభించిందని, ఇది అరుదైన కుడ్య శిల్పమని రచయిత, ఔత్సాహిక చరిత్రకారుడు. బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు.

శివుని రూపాల్లో భయానక రూపం కాల భైరవుడని, అతడి వాహనం శునకమని, ఆయుధాలుగా త్రిశూలం, ఖడ్గం, కపాల, కొడవలి, వజ్ర, పాము, పిన్నాక విల్లును సాధారణంగా కలిగి ఉంటాడని వివరించారు. మూడు కన్నులు కలిగి ఉండటం ఆ భైరవుని దివ్యత్వానికి నిద ర్శనమని తెలిపారు. ఈ అరుదైన కుడ్య శిల్పంలో కుడివైపు పైచేతిలో పద్మాన్ని కలిగి ఉండటం ప్రత్యేకమని, కింది చేతిలో గద ధరించి, ఎడమ వైపు పైచేతిలో సర్పాన్ని, ఇంకొకటి కటి హస్తంతో ఉండటం విశేషమన్నారు. ఇప్పటి వరకు వెలుగు చూడని ద్వార పాలకుల శిల్పాలలో ఇది ప్రత్యేకమైనదన్నారు. ఈ శిల్పం 13వ శతాబ్దానికి చెందిందని ప్రముఖ స్థపతి, వాస్తు శిల్పి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి స్పష్టం చేశారని రచయిత తెలిపారు.