
ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో మరో లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది, అక్కడ ఎహ్సాన్ అనే ఇస్లామిక్ మతోన్మాది ఒక హిందూ వివాహిత మహిళను హిందూ యువకుడిగా ట్రాప్ చేసి ప్రేమలోకి దింపాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా వివాహం చేసుకుని చెన్నైకి తీసుకెళ్లాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నోయిడాలోని గాది చౌఖండి నివాసిని ప్రియాశర్మ(పేరుమార్చాం) ఆమెకు ఒక ఆరుసంవత్సరాల అమ్మాయి ఉంది. ఆమె పనిచేస్తున్న కంపెనీలోనే పనిచేసేవాడు రాజామియాన్ అనే హిందూ పేరు పెట్టుకున్న ఎహ్సాన్ హుస్సేన్ . . ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు రాజామియాన్. అతను ముస్లిం అని తెలియక ప్రేమను అంగీకరించింది. పెళ్లి సమయంలో అతని నిజస్వరూపం తెలిసింది. దాంతో ఆ అమ్మాయి వివాహానికి ససేమీరా అనడంతో బెదిరించి, బలవంతంగా మతం మార్చాడు. వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆ అమ్మాయిని చెన్నైకి తీసుకెళ్లాడు.
చెన్నైకి వెళ్లిన తర్వాత అసలు రంగు చూపించడం మొదలు పెట్టాడు ఎహ్సాన్. కొట్టడం, తిట్టడంలాంటి చేస్తూ ఖైదీలాగా ఇంట్లోనే పెట్టేవాడు. ఇంతలో అమ్మాయి కుటుంబం నోయిడాలోని సెక్టార్-39 పోలీస్ స్టేషన్‌లో కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. సాంకేతిక సమాచారం ,ఆధారాల ఆధారంగా పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి చెన్నైలో ఆ అమ్మాయి ఉంటున్న ఇంటిపై దాడి చేశారు. తనను అక్కడి నుండి సురక్షితంగా నోయిడాకు తీసుకుని వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తనను మోసం చేసి బలవంతంగా మతం మార్చారని ఆ యువతి తన వాంగ్మూలంలో పేర్కొంది. ఈ సంఘటనలో ఎహ్సాన్ హుస్సేన్ తో పాటుగా అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పథకం ప్రకారమే హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నట్లు తేలింది. దీంతో పోలీసులు ముగ్గురు నిందుతులపై మత మార్పిడి, మోసం మరియు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీని తర్వాత, ముగ్గురినీ కోర్టులో హాజరుపరిచారు, అక్కడి నుండి వారిని జైలుకు తరలించారు. ఈ కుట్రలో మరెవరైనా పాల్గొన్నారా అని నిర్ధారించుకోవడానికి పోలీసులు ప్రస్తుతం ఈ విషయాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.