News

త్రివర్ణ పతాకంలో అశోకచక్రానికి బదులుగా యా రసూల్ అల్లా అని రాతలు

53views

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో త్రివర్ణపతాకానికి అవమానం జరిగింది. మతతత్వవాదులు తమ కార్యకలాపాలను ఆపడం లేదు. మతం పేరుతో బలాన్ని ప్రదర్శించడానికి దేశ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నారు. త్రివర్ణపతాకంలో అశోక చక్రానికి బదులుగా యా రసూల్ అల్లా అని రాశారు హస్రాస్ లో బరావాఫత్ ఊరేగింపు సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది, దీనిలో మతతత్వవాదులు త్రివర్ణ పతాకం నుండి అశోక చక్రాన్ని తొలగించి, దాని తెల్లటి గీత స్థానంలో ఉర్దూలో “యా రసూల్ అల్లా” అని రాశారు. ఈ సంఘటనతో ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొంది. కావాలని ఇది జాతీయ జెండాను అవమానించడమే అని జాతీయవాదులు నిరసన వ్యక్తం చేశారు.

జిల్లాలో మొహమ్మది ఊరేగింపు సందర్భంగా సెప్టెంబర్ న ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, హత్రాస్ పోలీసులు వెంటనే చర్య తీసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడమే కాకుండా, వారిద్దరిపై జాతీయ జెండా అవమాన నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన వెనుక ఉద్దేశ్యం ఏమిటో తెలుసుకోవడానికి వీడియోను క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.