
చత్తీస్ ఘడ్ బలరాంపూర్ జిల్లాలోని త్రికుండ పోలిస్ స్టేషన్ పరిధిలోని వీరేంద్ర నగర్ గ్రామంలో గణేష్ మండపం సమీపంలోని వాటర్ ట్యాంక్ పైభాగంలో హనుమాన్ ధ్వజం ఉంది. అయితే సెప్టెంబర్ 4న కొంతమంది యువకులు ఈ ధ్వజంపైన ఇస్లామిక్ మతపరమైన జెండాను ఉంచారు. . ఆ వ్యక్తులు ఈ చర్యను కూడా రికార్డ్ చేసి, తరువాత సోషల్ మీడియా లో పోస్టు చేశారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త కరమైన వాతావరణం నెలకొంది. స్థానికులు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకుని యువకులు ఏర్పాటు చేసిన జెండాను తొలగించారు. అక్కడ స్థానికులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తరువాత పోలీసులు ఇద్దరు మైనర్లతో సహా ముగ్గురిని అరెస్టు చేశారు.
ఈ సంఘటనపై ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ స్పందిస్తూ, “ఈ విషయంలో చర్యలు తీసుకున్నాము ఇద్దరు మైనర్లతో సహా ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు” అని అన్నారు. అంతేకాకుండా ఉపముఖ్యమంత్రి దుర్గ్‌లో జరిగిన మరో సంఘటనపై కూడా మాట్లాడారు., ఒక ఆర్మీ జవాను ఇంటిపైన భగవా ధ్వజ్‌ను ఉంచడంతో పోలీసులు అతనితో అనుచితంగా ప్రవర్తించారు. ఈ సంఘటనపై కూడా ఉపముఖ్యమంత్రి స్పందించారు. భారతీయ జనతా యువ మోర్చా [BJYM] బృందం దుర్గ్‌ను సందర్శించి అక్కడ భగవ ధ్వజాన్ని ఎగురవేస్తుందని డిప్యూటీ సీఎం తెలియజేశారు. “రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలను సహించబోము” అని ఆయన పేర్కొన్నారు.
దుర్గ్‌లోని మంచూర్ గ్రామంలో శనివారం ఇద్దరు పోలీసులు ఒక ఆర్మీ జవాన్‌ను తన ఇంటి పైభాగంలో ఏర్పాటు చేసిన భగవా ధ్వజాన్ని తీసేయమని గొడపడ్డారు. ఈవిషయంలో పోలీసులకు, అతనికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది, అందులో పోలీసులు ఆర్మీ జవాన్‌తో వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ సంఘటనలో పాల్గొన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని, చర్య తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హిందూ సంస్థలు హెచ్చరించడంతో విషయం మరింత తీవ్రమైంది.