News

“2047 నాటికి ఇస్లామిక్ దేశంగా ఇండియా”.. ఛంగూర్ బాబా కేసులో చార్జిషీట్..

77views

ఉత్తర్ ప్రదేశ్‌లో బలరాంపూర్‌లో జలాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాబా ముసుగులో హిందువును, సిక్కు మతం మార్చే పెద్ద రాకెట్‌ ముఠాకు ఈయన నాయకత్వం వహిస్తున్న విషయాన్ని యూపీ పోలీసులు బట్టబయలు చేశారు. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలరాంపూర్ జిల్లాలోని మాధ్‌పూర్ కేంద్రంగా, విలాసవంతమైన భవనం అడ్డాగా ఛంగూర్ బాబా ఈ అరాచకాలకు పాల్పడుతున్నట్లు తేలింది. లవ్ జిహాద్ ద్వారా హిందూ, సిక్కు యువతను వలలో వేసుకోవడానికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చడంతో పాటు, ఇస్లామిక్ దేశాల నుంచి నిధులు పొందడం, పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో జలాదుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా, అతడి కుమారుడు మోహబూబ్‌పై పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. గత మూడేళ్లుగా హిందూ బాలికను వలలో వేసుకుని మతం మార్చడానికి 1000 మందికి పైగా ముస్లిం యువకులకు నిధులు సమకూర్చినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయచి. ఈ కాలంలోనే ముస్లిం దేశాల నుంచి ఛంగూర్ బాబా రూ. 500 కోట్లు పొందినట్లు ఉత్తర్ ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్(ఏటీఎస్) తేల్చింది.

ఇవే కాకుండా మరో భయంకరమైన కుట్ర గురించి చార్జిషీట్ పేర్కొంది. 2047 నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనే కుట్రతో, లవ్ జిహాద్, బెదిరింపుల ద్వారా ప్రజల్ని మతం మార్చాలని ఇతడి ముఠా చాలా కాలంగా పనిచేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. చార్జిషీట్‌లో 29 మంది సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయి. వీరిలో 10 మంది ప్రత్యక్షంగా ఒత్తిడి, బలవంతం ద్వారా వేధింపులు ఎదుర్కొన్నారు. ఇందులో ఒక మహిళ మొహబూబ్, అతడి అనుచరుడు నవీన్ రోహ్రా మతమార్పిడి పేరుతో లైంగిక దోపిడీ, వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

2047 నాటికి భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలని పదే పదే చెప్పేవారిన ఒక బాధితురాలు విచారణలో చెప్పింది. చీర తీసుకోవాలనే నెపంతో ఒక ప్రైవేట్ గదికి రప్పించి, ఆమెపై దాడి చేసి, మతాన్ని మార్చుకోవాలని ఒత్తిడి చేసినట్లు మరో మహిళ ఆరోపించింది. దర్యాప్తులో నవీన్ రోహ్రాను ఈ ముఠాలో కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.