NewsSeva

వనవాసీల సేవలో సంఘమిత్ర

104views

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి ఆద్వర్యంలో చెంచు గూండాలలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నలమల అడవుల్లో ఉన్న చెంచులకు దుస్తులు పంపిణి చేశారు.

వర్షా కాలం, భయంకరమైన అడవి దోమల కాటు నుండి, తద్వారా వచ్చే రోగాల నుండి, చలి నుండి అడవి బిడ్డలను కొంత మేరకైనా కాపాడుటకు దత్తత చెంచు గూడేలలో మగవారి, ఆడవారి, చిన్న పిల్లలకు దుప్పట్లు, చీరలు మరియు దుస్తులు పంపిణీ దుస్తుల పంపిణి చేపట్టింది.

ఈ కార్యక్రమంలో సంఘమిత్ర అధ్యక్షుడు శ్రీ చిలుకూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో, విభాగ్ ప్రౌడ ప్రముఖ్ శ్రీ రామ్ ప్రసాద్, ఆవాస్ ప్రముఖ్ శ్రీ గంగాధర్ జానాల గూడెం, బలపాల తిప్ప, పాత మాడుగుల, ఎర్రమఠం గూడేలలో దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. స్థానిక ప్రముఖుడు శ్రీ సుధాకర్ సమన్వయ కర్తగా వ్యవహరించారు.